Home > EMPLOYEES NEWS > ఉద్యోగ సంఘాలకు సీఎం అభయహస్తం

ఉద్యోగ సంఘాలకు సీఎం అభయహస్తం

BIKKI NEWS (MARCH 10) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో ఏర్పాటు చేసిన సమావేశంలో (employees union meeting with cm revanth reddy news) ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొ. కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా పీఆర్‌సీ, 317 జీవో కారణంగా బదిలీ సమస్యలు, పదోన్నతులు, స్పౌజ్ బదిలీలు, పాత పెన్షన్ అమలు, పెండింగ్ డీఏలు,.బిల్లులు, ఈఎచ్‌ఎస్ వంటి సమస్యలు ప్రస్తావించారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్, పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ ను నియమిస్తామని ఉపాధ్యాయులకు సిఎం రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు.

ఆర్టీసీ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, సంఘాలు ఉండాల్సిందేనని, సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని, అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

డిఎ పై త్వరలో ప్రకటిస్తాం. విధానపరమైన అంశాలను మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం

2008 DSC బిఈడి అభ్యర్థుల ఉద్యోగాలపై 12 జరిగే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని సిఎం తెలిపారు.

జిఒ 317 సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, కచ్చితంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు.

రెగ్యులర్ పోస్టుల్లో రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి, పదోన్నతులకు ఆటంకం లేకుండా చూస్తామని, రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అవసరం అనుకుంటే ఒఎస్డీ లు గా నియమించుకుంటామని తెలిపారు.

మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచింది. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.

సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలే.. మీకు విశ్వాసం కల్పించడానికే మీతో చర్చలు జరిపాం..
ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాం.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తాం

విద్యార్థి, ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్దించింది..

తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారు..

శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారు..

తెలంగాణ బాపు అని తనకు తానే చెప్పుకుంటుండు.. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలి.

తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్.

తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదు.

తెలంగాణలో ఆదాయం పడిపోయింది… ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగింది.

మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు వేసినా మేం ప్రచారం కల్పించుకోలేదు.. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం.. 11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం.95శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారు. సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే… ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందే. మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుంది. సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోం.

వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. గవర్నర్ తో మాట్లాడి కోదండరాం సార్ ను శాసన మండలికి పంపుతాం. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.