Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 9th MARCH 2024

1) మిస్ వరల్డ్ 2024 గా ఎవరు నిలిచారు.?
జ : క్రిస్టీనా పిజికోవా

2) ప్రపంచంలోనే అతి పొడవైన రెండు టన్నెల్ మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ టన్నెల్స్ పేరు ఏమిటి.?
జ : సేలా టన్నెల్ (అరుణాచల్ ప్రదేశ్)

3) సేలా టన్నెల్ (అరుణాచల్ ప్రదేశ్) ఏ మార్గాలను కలుపుతుంది.?
జ : బలిపారా – చారిదువార్ – తవాంగ్

4) అస్సాంలో 125 అడుగుల ఎత్తైన లచిత్ బోర్చుకన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు ఇతను ఏ రాజ వంశానికి చెందిన వాడు.?
జ : అహోం రాజ్య వంశం (సరాయ్‌ఘాట్ యుద్ధం)

5) జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.?
జ : సెంథిల్ పాండియన్

6) యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నూతన అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నాడియో కాల్వినో

7) భారత్ శక్తి పేరుతో భారత త్రివిధ దళాలు ఎక్కడ సైనిక విన్యాసాలను నిర్వహించనున్నాయి.?
జ : పోఖ్రాన్

8) జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కిశోర్ మక్వానా

9) జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : వడ్డేపల్లి రాంచందర్ & లవ్ కుష్ కుమార్

10) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్ గా, ఓవరాల్ గా మూడో బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జేమ్స్ అండర్సన్ (మురళీధరన్ – 800, వార్న్ – 708)

11) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులను అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన (అనిల్ కుంబ్లే రికార్డు 35 సార్లు) అధిగమించి భారత బౌలర్ గా ఎవరు నిలిచారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్ (36సార్లు)

12) ఓకే ప్రత్యర్థి పై స్వదేశంలో 100 టెస్ట్ వికెట్లు తీసిన మూడో బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్ – ఇంగ్లండ్ పై (బ్రాడ్ – ఆస్ట్రేలియా పై‌, అండర్సన్ – భారత్ పై)

13) అమెరికా లో స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు అందుకున్న ప్రవాస తెలంగాణ వాసి ఎవరు.?
జ : అనిల్ బొయినపల్లి

14) పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అసిఫ్ అలీ జర్దారీ