Home > JOBS > DSC (TRT) > TS DSC 2024 – స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల పరీక్ష సిలబస్‌, పరీక్ష విధానం

TS DSC 2024 – స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల పరీక్ష సిలబస్‌, పరీక్ష విధానం

BIKKI NEWS (MARCH 12) : తెలంగాణ రాష్ట్ర డీఎస్సీలో భాగంగా తొలిసారిగా భర్తీ చేయనున్న స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష సిలబస్ (DSC 2024 SPECIAL EDUCATION TEACHERS POSTS SYLLABUS) విద్యా శాఖ ఖరారు చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT), స్కూల్‌ అసిస్టెంట్‌ (SA) కేటగిరీల్లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 220 స్కూల్‌ అసిస్టెంట్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌), మరో 796 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు భర్తీ చేయనున్నారు.

★ పరీక్ష విధానం

ఈ టీచర్‌ పోస్టులకు పరీక్షను 80మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 160 ప్రశ్నలతో పరీక్ష ఉండగా.. ఒక్కో ప్రశ్నకు 0.5 మార్కు ఉంటుంది. మరో 20 మార్కులను టెట్‌ వెయిటేజి ద్వారా ఇస్తారు. ఈ టీచర్‌ పోస్టులకు అభ్యర్థులు వచ్చే నెల 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

DSC SPECIAL S.A. POSTS SYLLABUS

DSC SPCIAL S.G.T. POSTS SYLLABUS