TG DSC – అభ్యర్థులకు నిబంధనలు ఇవే…

BIKKI NEWS (JULY 18) : DSC 2024 EXAM GUIDELINES. తెలంగాణ రాష్ట్ర డిఎస్సి 2024 నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు నేటి నుండి కంప్యూటర్ బేస్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి మధ్యలో ఆరు రోజులు సెలవు దినాలలో పరీక్షలు జరగవు. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం విద్యాశాఖ నిబంధనలు విడుదల చేసింది

DSC 2024 EXAM GUIDELINES

1) డీఎస్సీ పరీక్షను మొట్టమొదటిసారి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.

2) అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు.

3) అభ్యర్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

4) ఉదయం సెషన్ 9.00 గంటల నుండి 11:30గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

5) అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు కచ్చితంగా ఏదైనా వ్యక్తిగత ఐడి ని తీసుకుని రావాల్సి ఉంటుంది.

6) పరీక్ష కేంద్రంలోకి సెల్‌పోన్స్ మరియు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు అనుమతి లేదు.

7) పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రం నుండి బయటకు పంపరు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు