DOST 2024 : మే 3న దోస్త్ నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 02) : తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST NOTIFICATION 2024 ) దరఖాస్తులు స్వీకరించే దోస్త్ నోటిఫికేషన్ మే 3వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం.

ఇంటర్మీడియట్ మరియు తత్సమాన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులు ఎంచుకున్న కళాశాలలో ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా దోస్త్ కల్పించనుంది.

DOST NOTIFICATION 2024