DOST 2024 – నేటి నుండి దోస్త్ వెబ్ ఆప్షన్లు

BIKKI NEWS (MAY 20) : DOST 2024 FIRST PHASE WEB OPTIONS – డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నేటి నుండి మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వెబ్ ఆప్షన్ల గడువు మే 30వ తేదీ వరకు కలదు.

ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థులు 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ లలో పాల్గొనవచ్చు. మొదటి విడత సీట్ల కేటాయింపు జూన్ 3వ తేదీన చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,066 డిగ్రీ కళాశాలలు ఉండగా, అందులో 4,49,449 సీట్లు కలవు.