DOST 2024 – నేడు మొదటి విడత సీట్ల కేటాయింపు

BIKKI NEWS (JUNE 06) : DOST 2024 FIRST PHASE SEATS ALLOTMENT. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రథమ సంవత్సరపు ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)కు సంబంధించి మొదటి విడత సీట్లను గురువారం కేటాయిస్తారు.

బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కేటాయింపు చేయనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌. లింబాద్రి మొదటి సీట్లు కేటాయిస్తారు.

వెబ్సైట్ : https://dost.cgg.gov.in