DOST 2024 – నేటి నుండి మూడో దశ రిజిస్ట్రేషన్

BIKKI NEWS (JUNE 19) : డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లలో భాగంగా మూడో దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభం (dost 2024 3rd phase counselling) కానుంది. ఇప్పటికే మొదటి దశ రెండో దశలలో విద్యార్థులకు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

dost 2024 3rd phase counselling

మూడో దశ దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుండి జూలై 02 తేదీ వరకు జరగనుంది. మూడో దశ సీట్ల కేటాయింపు జూన్ 6వ తేదీన చేయనున్నారు..

మొదటి మరియు రెండో దశలో కలిపి 90 వేల మంది విద్యార్థులు కళాశాలలో చేరే అవకాశం ఉందని తెలిపారు. జూలై 15 నుండి ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

రెండో విడతలో సీటు పొందిన విద్యార్థులు జూన్ 19 నుండి 24వ తేదీ వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీటును కన్ఫామ్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే సెంటు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మొదటి విడతలో సీటు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు సెకండ్ విడతలో సీటు పొందితే కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు.

అలాగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు రాశారని, సప్లిమెంటరీ ఫలితాల తర్వాత వీరి కోసం ప్రత్యేకంగా దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ విద్యార్థులందరూ దాదాపు డిగ్రీలోనే అడ్మిషన్లు పొందే అవకాశం ఉందని తెలిపారు.

DOST 2024 WEBSITE

LATEST JOB NOTIFICATIONS LINK

JOIN OUR TELEGRAM CHANNEL