Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 13th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 13th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 13th

1) పశ్చిమ కనుములను తమిళనాడులో ఏమని పిలుస్తారు.?
జ : నీలగిరిలు

2) అంతర్ రాష్ట్ర మండలి ఏ కమిషన్ సూచన మేరకు జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.?
జ : సర్కారియా కమిషన్

3) మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327లో రాజధానిని ఢిల్లీ నుండి ఏ నగరానికి మార్చాడు.?
జ : దేవగిరి

4) ఏ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటన్ రాణి పాలన ప్రారంభమైంది.?
జ : భారత ప్రభుత్వ చట్టం 1858

5) సిపాయిల తిరుగుబాటు మీరట్ లో ఏ రోజు ప్రారంభమైంది.?
జ : 1857 మే 10

6) జస్టిస్ ఉద్యమ స్థాపకులు ఎవరు.?
జ: ఎం మొదలియార్, టి యం నాయర్, టి త్యాగరాజ చెట్టీ.

7) “ది బుద్ధ అండ్ దమ్మ” అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?
జ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

8) గర్భస్థ శిశువుల హృదయ స్పందన రేటును వినడానికి ఉపయోగించే పరికరం ఏ సూత్రం మీద పనిచేస్తుంది.?
జ : డాప్లర్ ప్రభావం

9) యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం ఏమిటి.?
జ : డైనమో/ టర్బైన్

10) అప్పుడే పుట్టిన శిశువు యొక్క హృదయ స్పందనల సంఖ్య ఎంత 130 140

11) స్పీగ్మో మానోమీటర్ అనే పరికరంతో దేనిని కొలుస్తారు.?
జ : రక్త పీడనము

12) మూత్రం లేత పసుపు వర్ణంలో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం ఏమిటి?
జ : యూరో క్రోమ్

13) క్రికెట్ బ్యాట్ల తయారీలో ఉపయోగించే చెట్టు పేరు ఏమిటి? జ : సాలిక్స్

14) పేదవాని కలప అని ఏ చెట్టును పిలుస్తారు.?
జ : వెదురు

15) LASER పూర్తి రూపం ఏమిటి.?
జ : light amplification by stimulated emission of radiation

16) ఢిల్లీలోని కుతుబ్మినార్ వద్ద మొహరౌలి ఉక్కు స్తంభాన్ని నిర్మించినది ఎవరు?
జ: రెండవ చంద్రగుప్తుడు

17) భూమి తన అక్షం మీద పరిభ్రమిస్తుందని ప్రకటించిన మొదటి భారత ఖగోళ శాస్త్రవేత్త ఎవరు?
జ : ఆర్యభట్ట

18) “కవి రాజు” అనే బిరుదు గల గుప్త రాజు ఎవరు.?
జ : సముద్రగుప్తుడు

19) అస్సాం దుఃఖ దాయని అని ఏ నదికి పేరు.?
జ: బ్రహ్మపుత్ర నది

20) భారతదేశానికి దక్షిణాన చివరి పాయింట్ ఏమిటి?
జ: ఇందిరా గాంధీ పాయింట్/ పిగ్మేలియన్ పాయింట్