DAILY G.K. BITS IN TELUGU MARCH 28th
1) ముద్ర పథకంలో ఇచ్చే రుణ పరిమితి ఎంత.?
జ : 10 లక్షల వరకు
2) భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా గా ఏ నగరాన్ని పిలుస్తారు.?
జ : కోయంబత్తూర్
3) తెలంగాణలో లాటరైట్ నిక్షేపాలు ఏ ప్రాంతంలో కలవు.?
జ : వికారాబాద్
4) ఏ దేశపు శాస్త్రజ్ఞులు రాకెట్ సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి కృత్రిమ గుండెను అభివృద్ధి చేశారు.?
జ : చైనా
5) జర్డోజి అంటే ఏమిటి.?
జ : మెటల్ ఎంబ్రాయిడరీ
6) భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారు.?
జ : రష్యా
7) 1969 ఉద్యమ కాలంలో క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు.?
జ : శ్రీధర్ రెడ్డి
8) పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ :స్పీకర్
9) స్వాతంత్ర అనంతరం భారతదేశంలో అభివృద్ధి పరిచిన మొదటి సముద్ర ఓడరేవు ఏది?
జ : కాండ్లా
10) తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు.?
జ : లంబాడాలు
11) రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి రాజ్యాంగం సూచించిన కనీస వయసు ఎంత .?
జ : 35 ఏళ్లు
12) తెలంగాణ గాయని బెల్లి లలిత ఏ సంస్థతో సంబంధం కలిగి ఉండింది.?
జ : తెలంగాణ కళా సమితి
13) రాజస్థాన్ లోని ఖేత్రి గనులు దేనికి ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి.?
జ : రాగి
14) హాజర రామ దేవాలయం ఏ సామ్రాజ్యంతో సంబంధం కలిగి ఉంది.?
జ : విజయనగర సామ్రాజ్యం
15) ఏ రాష్ట్రం 75% కంటే ఎక్కువ అడవి ప్రాంతాన్ని కలిగి ఉంది.?
జ : మణిపూర్