DAILY G.K. BITS IN TELUGU MARCH 27th
1) ప్రవర అనునది ఏ నది యొక్క ఉపనది.?
జ : గోదావరి
2) సర్గాసో సముద్రం గల మహాసముద్రం ఏది?
జ : ఉత్తర అట్లాంటిక్
3) చనాఖా – కోరటా గ్రామాలు ఏ నదీతీరంలో ఉన్నాయి.?
జ : పెన్ గంగా నది
4) భారత స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన మొదటి అణు రియాక్టర్ ఏది?
జ : అప్సర
5) ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్ పేరుతో మొదటి అణు పరీక్ష రాజస్థాన్ లో జరిగిన సంవత్సరం ఏది.?
జ : 1974
6) భారతీయ అణు కార్యక్రమం పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : హోమీ జే బాబా
7) అణు రియాక్టర్లలో ఉపయోగించే భారజలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడ ఉంది.?
జ : మణుగూరు
8) భారత అంతరిక్ష కార్యక్రమం పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : విక్రమ్ సారాభాయ్
9) హెచ్ఐవి వ్యాక్సిన్ ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసింది అది ఎక్కడ ఉంది.?
జ : పూణే
10) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు ఏవి.?
జ : ఎర్ర నేలలు
11) ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ఇండియా గా భారత్ లోని ఏ పురాతన విశ్వవిద్యాలయాన్ని పేర్కొంటారు.?
జ : నలంద
12) హర్షుడు మహా మోక్ష పరిషత్ ను ఎక్కడ నిర్వహించాడు.?
జ : ప్రయాగ
13) భానుడు ఎవరి ఆస్థానంలోని కవి.?
జ : హర్షుడు
14) ధర్మగంజ్ అనే గ్రంథాలయం ఏ విశ్వవిద్యాలయంలో ఉంది.?
జ : నలంద
15) పక్షుల గుడ్ల గురించి అధ్యయనాన్ని ఏమంటారు.?
జ : ఊలాజీ