DAILY G.K. BITS IN TELUGU MARCH 22nd
1) నిజాం – హైదరాబాద్ రాష్ట్రంపై భారత ప్రభుత్వం ఏ తేదీన పోలీస్ చర్య చేపట్టింది .?
జ : 13 సెప్టెంబర్ 1948
2) “అమ్మ తెలంగాణామా ఆకలి కేకల గానమా” అనే ప్రఖ్యాత పాటను రాసినది ఎవరు.?
జ : గద్దర్
3) www యొక్క సంక్షిప్త రూపం ఏమిటి.?
జ : వరల్డ్ వైడ్ వెబ్
4) తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఎంతమంది రాజ్యసభ సభ్యులు కలరు.?
జ : ఏడుగురు
5) చేనేతకారుల జీవితాలను సులభం చేయడానికి ఒక యంత్రాన్ని కనిపెట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరు.?
జ : ఎక్కా యాదగిరి రావు
6) చంద్రునిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా కాలు మోపిన సంవత్సరం ఏది?
జ : 1969
7) 1984లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందన్న వాస్తవాలను పరిశీలించడానికి నియమించబడిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు.?
జ : కె. జయభారత్ రెడ్డి
8) ఒక ఎకరం భూమికి ఎన్ని గుంటలు ఉంటాయి.?
జ : 40
9) మానవ పుర్రె లోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత.?
జ : 22
10) రంగన్ తిట్టు పక్షి అభయారణ్యం గల రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక
11) జీ4 కూటమిలోని సభ్య దేశాలు ఏవి?
జ : భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్
12) దంతావాల కమిటీ దేనితో సంబంధం కలిగి ఉంది.?
జ : బ్లాక్ స్థాయి ప్రణాళిక
13) తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఎవరు పేరు పెట్టారు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ
14) పార్లమెంటులో ఏ సభలోను సభ్యత్వం లేకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించేది ఎవరు?
జ : ఉపరాష్ట్రపతి
15) అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : ఆడం స్మిత్