DAILY G.K. BITS IN TELUGU MARCH 20th
1) ఏ అక్షాంశాన్ని గ్రేట్ సర్కిల్ గా పేర్కొంటారు.?
జ : 0° N
2) కరేవా అనే మృత్తికలు వేటి ద్వారా నిక్షేపితం అవుతాయి.?
జ : హిమానీ నాదాలు
3) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని పట్టణాల సంఖ్య.?
జ : 7935
4) భూభాగంపై క్షిపణుల పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన పర్యావరణ ఉద్యమం పేరు ఏమిటి?
జ : బాలియా పాల్ ఉద్యమం
5) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత ఎంత.?
జ : 306
6) హైదరాబాద్ కౌలు, వ్యవసాయ చట్టం చేసిన సంవత్సరం.?
జ : 1950
7) ప్రణాళిక సంఘం ప్రారంభించిన సంవత్సరం.?
జ : 1950
8) 1857 తిరంగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం గా పేర్కొన్నది ఎవరు.?
జ : వీడి సావర్కర్
9) చౌరి చౌర సంఘటన ఎప్పుడు జరిగింది.?
జ : 1922
10) సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు.?
జ : అబ్దుల్ గఫార్ ఖాన్
11) సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు.?
జ : దాదాబాయి నౌరోజి
12) లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించాడు.?
జ : నిజాం అలీ ఖాన్
13) 1857లో భారక్ పూర్ లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరుడైన సైనికుడెవరు.?
జ : మంగళ్ పాండే
14) తెలంగాణ ప్రాంతంలో బుడిబుంగ అంటే ఏమిటి.?
జ : ఒక పక్షి
15) హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు.?
జ : బి. శ్రీనివాస శర్మ