Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 10th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 10th

DAILY G.K. BITS IN TELUGU JANUARY 10th

1) ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 11

2) భారతదేశంలో సన్ సిటీ అని దేన్ని పిలుస్తారు.?
జ : జోద్ పూర్

3) గరీబి హఠవో నినాదాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇందిరా గాంధీ ఇచ్చారు.?
జ : నాలుగవ పంచవర్ష ప్రణాళిక

4) రెండవ అలెగ్జాండర్ గా పేరుపొందిన భారత సుల్తాన్ ఎవరు.?
జ : అల్లావుద్దీన్ ఖిల్జీ

5) మానవుడి పుర్రె లోని ఎముకల సంఖ్య ఎంత.?
జ : 22

6) మెదడు ఉపరితలంపై ఉండే గట్ల వంటి నిర్మాణాన్ని ఏమంటారు.?
జ : గైరీ

7) ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే మూడవ భాష ఏది.?
జ : హిందీ

8) జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జ : చార్లెస్ డార్విన్

9) ఇన్సులిన్ హార్మోన్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి.?
జ : డయాబెటిస్

10) అజంతా గుహలు ఏ రాష్ట్రంలో
ఉన్నాయి.?
జ : మహారాష్ట్ర

11) ఆర్కిటిక్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన తొలి పరిశోధన కేంద్రం పేరు ఏమిటి.?
జ : హిమాద్రి

12) భారతదేశం సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు.?
జ హెచ్.జి. కానియా

13) ఆధార్ కార్డ్ రూపకర్త ఎవరు.?
జ : నందన్ నిలేఖని

14) ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను ఏ నేషనల్ పార్కులో సంరక్షిస్తున్నారు.?
జ: కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం)

15) కాంతి తరంగాగ్రాలు చిన్న అవరోధాకి వాటి అంచుల వెంబడి వొంగి ప్రయాణిచడాన్ని ఏమంటారు.?
జ : కాంతి వివర్తనం

16) బంగారాన్ని కరిగించుటకు ఉపయోగించే రసాయనము ఏమిటి?
జ : ఆక్వా రీజియా (రసరాజము)

17) ‘ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా’ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు? జ : మోక్షగుండం విశ్వేశ్వరయ్య

18) 1974 ప్రోఖ్రాన్ వద్ద ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిపిన అణు పరీక్షలకు పెట్టిన కోడ్ ఏమిటి.?
జ : స్మైలింగ్ బుద్ధ

19) జోరాస్ట్రియన్ (పార్శీ) మతం యొక్క పవిత్ర గ్రంథం ఏది.?
జ: జెండా అవెస్టా

20) “ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్” అనే గ్రంథ రచయిత ఎవరు.?
జ : బాలగంగాధర్ తిలక్