DAILY G.K. BITS IN TELUGU JANUARY 22nd
1) ఆహార వ్యవసాయ నోబెల్ బహుమతిగా అభివర్ణించే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ఎవరు ప్రారంభించారు.?
జ : నార్మన్ బోర్లాగ్
2) ప్రపంచ యోగా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 21
3) ఇస్రో అంగారక గ్రహం అధ్యయనం కోసం చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : మంగళయాన్
4) డ్వాక్రా (Development of Women and Children in Rural Areas) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1982
5) స్వాతంత్ర అనంతరం జాతీయాదాయాన్ని లెక్కించడానికి “జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని” ఎవరి అధ్యక్షుడిగా ఏర్పాటు చేశారు.?
జ : మహాలనోబిస్ (1949 లో)
6) రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్ప కాలిక రుణాలపై వడ్డీ రేటును ఏమని పిలుస్తారు.?
జ : రేపో రేటు
7) విద్యా హక్కు చట్టం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది.?
జ : 2010 ఏప్రిల్ – 01 నుంచి
8) 2011 జనాభా లెక్కల కమిషనర్ ఎవరు.?
జ : డా. చంద్రమౌళి
9) మనం నివసిస్తున్న భూమి బల్లపరుపుగా కాదు గుండ్రంగా ఉందని మొదట చెప్పిన శాస్త్రజ్ఞుడు ఎవరు.?
జ : ఆరిస్టాటిల్
10) సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏది.?
జ : భూమి
11) సౌర కుటుంబంలో సూర్యుడి నుండి దూరంలో మూడవది, పరిమాణం బట్టి చూస్తే 5వ గ్రహం ఏది.?
జ : భూమి
12) ఏప్రిల్ – జూన్ నెల మధ్య పండించే పంట రుతువును ఏమని పిలుస్తారు.?
జ : జయాద్ కాలం
13) సంతాలులు అనే తెగ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : పశ్చిమబెంగాల్
14) 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య హక్కును జీవించే హక్కులో భాగంగా రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ లో పొందుపరిచారు.?
జ : ఆర్టికల్ – 21(A)
15) రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ – 368
16) క్రీ.పూ. 600వ సంవత్సరంలో మగధ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు.?
జ : బింబిసారుడు (హర్యంక వంశం)
17) చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించిన అశోకుని కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : క్రీ.పూ. 261
18) ఆటోమొబైల్స్ లో వాడే హైడ్రాలిక్ బ్రేకులు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.?
జ : పాస్కల్ నియమం
19) ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు.?
జ : మాంగ్రూవ్ మొక్కలు
20) “ప్రోటీన్ల తయారీ కర్మాగారాలు” అని ఏ కణాలను పిలుస్తారు.?
జ : రైబోజోములు