Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU MAY 5th

DAILY G.K. BITS IN TELUGU MAY 5th

GK BITS

DAILY G.K. BITS IN TELUGU MAY 5th

1) మొదటి రౌండ్ టేబుల్ సమావేశం విఫలం అవ్వడానికి కారణం.?
జ : సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొనక పోవడం

2) మహాత్మా గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఏకైక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది.?
జ : బెల్గాం

3) విభజన కాలము నాటికి భారతదేశంలో గల స్వదేశీ సంస్థానాల సంఖ్య ఎంత.?
జ : 562

4) భారతదేశంలో హత్యగావించబడిన వైస్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ మేయో

5) పోర్చుగీసు అడ్మిరల్ వాస్కోడిగామా కాలీకట్ కు ఎప్పుడు వచ్చాడు.?
జ : 1498

6) రాజ్యాంగ ప్రవేశికను తయారుచేసినది ఎవరు?
జ : జవహర్ లాల్ నెహ్రూ

7) భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు ఎవరు.?
జ : పనపాక్కం ఆనందాచార్యులు

8) భారతదేశంలో ఏ పట్టణాన్ని క్వీన్ ఆఫ్ అరేబియా అని అంటారు.?
జ : కోచ్చి

9) గాలిలో లభించని ఉత్కృష్ట వాయువు ఏది?
జ : రేడాన్

10) బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం పేరు ఏమిటి?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము

11) అన్ని ఆమ్లాలలో ఉండే సామాన్య మూలకం ఏది?
జ : ఉదజని (హైడ్రోజన్)

12) సాధారణ సన్ స్క్రీన్ లోషన్లు ఏ కిరణాల నుండి రక్షణ కల్పిస్తాయి.?
జ : అతినీలలోహిత

13) చార్మినార్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది .?
జ : 1591

14) దాస్ క్యాపిటల్ రచించినది ఎవరు?
జ : కార్ల్ మార్క్స్

15) డయోడును దేనికి ఉపయోగిస్తారు.?
జ : ఏసి విద్యుత్ ను డిసి విద్యుత్ గా మార్చడానికి