Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU MARCH 17th

DAILY G.K. BITS IN TELUGU MARCH 17th

DAILY G.K. BITS IN TELUGU MARCH 17th

1) ప్రఖ్యాత చిత్రం ‘మాభూమి’ లో ‘పల్లెటూరి పిల్లగాడ పశుల గాసే మొనగాడా’ అనే గీతాన్ని రచించింది ఎవరు.?
జ : సుద్దాల హనుమంతు

2) తెలంగాణలో ఉడికించిన ధాన్యాలను ఏమని వ్యవహరిస్తారు.?
జ : గుడాలు

3) అలంపూర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది .?
జ : తుంగభద్ర

4) భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని దేని నుండి గ్రహిస్తుంది.?
జ : భారత ప్రజల నుండి

5) తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయం ఏ జిల్లాలో ఉంది.?
జ : జగిత్యాల

6) ఎల్‌నినో అనే పదం దేనికి సంబంధించినది..?
జ : వాతావరణం

7) దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమ… ఉత్తర మైదాన ప్రాంతం నుండి వేటి ద్వారా వేరు చేయబడుతుంది.?
జ : వింధ్య పర్వతాలు

8) కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో ‘వినయ భూషణుడు’ అని బిరుదుతో రుద్రదేవుడు పేర్కొన్నబడ్డాడు.?
జ : ద్రాక్షారామ శాసనం

9) 2011 జనాభా లెక్కల ప్రకారం 2001 – 11 మధ్య కాలంలో తెలంగాణ వార్షికంగా ఎంత శాతం వృద్ధి చెందింది.?
జ : 1.4 శాతం

10) పేదరికం, నిరుద్యోగిత, మూలధన కొరత, సనాతన ఉత్పత్తి పద్ధతులు ఏ దేశాలలో చూస్తారు.?
జ : అభివృద్ధి చెందని దేశాలు

11) దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి దురాగతాలను ఎదిరించిన ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు ఏ తాలూకాకు చెందినవారు.?
జ : జనగాం తాలూకా

12) భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో చొరవ తీసుకున్నది ఎవరు?
జ : ఏ. ఓ. హ్యూమ్

13) ఒక దేశంలో స్థూల దేశ ఉత్పత్తి కంటే దేశ జనాభా వేగవంతంగా పెరిగితే తలసరి ఆదాయం ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది

14) ఉర్దూ గజల్స్ సంపుటిని ‘దివాన్’ పేరుతో ప్రచురించిన నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు.?
జ : మా లఖ ఛందా

15) జాతక కథలు ఏ భాషలో రచించబడ్డాయి.?
జ : పాళీ