Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU JANUARY 23rd

DAILY G.K. BITS IN TELUGU JANUARY 23rd

DAILY G.K. BITS IN TELUGU JANUARY 23rd

1) భారతదేశంలో ‘శాశ్వత శిస్తు విధానాన్ని’ అమలుపరిచిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ కార్న్‌వాలీస్

2) 1875లో ఎవరు స్థాపించిన మహ్మదన్ ఆంగ్లో ఒరియంటల్ కళాశాల నేడు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీగా సేవలు అందిస్తుంది.?
జ : సయ్యద్ ఆహ్మద్ ఖాన్

3) భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమాజంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.?
జ : లాహోర్

4) నగిషీ (పిలిగ్రీ) పనిలో ఉపయోగించే లోహం ఏది.?
జ : వెండి

5) తెలంగాణలో కనుగొనబడ్డ రాక్షస గుళ్ళు ఏ యుగానికి సంబంధించినవి.?
జ : మెగాలిథిక్

6) హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడిన మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఏది.?
జ : సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్

7) శాతవాహనుల కాలంనాటి బంగారు నాణానికి ఏమని పేరు.?
జ : సువర్ణ

8) ఏ సాధారణ ఎన్నికలలో భారత ఎన్నికల సంఘం అంధుల బ్రెయిలీ ఓటర్ స్లిప్పులను ప్రవేశపెట్టింది.?
జ : 2019 సాదరణ ఎన్నికలు

9) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి న్యాయపరమైన హక్కుల జాబితాలోకి చేర్చినది.?
జ : 44వ రాజ్యాంగ సవరణ (1978)

10) భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడింది.?
జ : పంజాబ్

11) ఏ రకమైన నేల తెలంగాణలో అత్యధిక ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉన్నది.?
జ ఎర్రమట్టి నేలలు

12) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాలో అతి తక్కువ అక్షరాస్యత శాతాన్ని కలిగి ఉంది.?
జ : జోగులాంబ గద్వాల

13) 2014లో తెలంగాణలో స్థాపించబడిన హార్టికల్చర్ యూనివర్సిటీకి ఎవరి పేరును పెట్టారు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ

14) పసుపుపచ్చ విప్లవం ఏ ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ప్రారంభించబడింది.?
జ : నూనె గింజలు

15) కల్పనా చావ్లా ఏ అంతరిక్ష వాహక నౌక తో సంబంధాన్ని కలిగి ఉంది.?
జ : కొలంబియా

16) అల్యూమినియం యొక్క ప్రధాన ముడి ఖనిజం ఏమిటి.?
జ : బాక్సైట్

17) పాదరసంతో ఉష్ణోగ్రత జ్ఞాపకాన్ని (థర్మా మీటర్) మొట్ట మొదటిసారిగా తయారు చేసినది ఎవరు.?
జ : గాబ్రియోల్ డేనియల్ ఫాలన్‌హీట్

18) నిజాం కాలంలో బ్రిటిష్ వారితో “స్టార్ ఆఫ్ ఇండియా” అవార్డుతో సత్కరించబడినది ఎవరు.?
జ : మొదటి సాలర్ జంగ్

19) దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఉన్న ప్రదేశం ఏమిటి?
జ : నేలకొండపల్లి (ఖమ్మం)

20) ఏ తెగవారు గోండులకు ‘గోండి పురాణాన్ని’ వినిపిస్తారు.?
జ : పర్దాన్ తెగ