Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 28th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 28th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 28th

1) ఒక పదార్థం ఆక్సిజన్ తో చర్య జరపడం వలన ఉష్ణం ఏర్పడు ప్రక్రియను ఏమంటారు.?
జ : దహనం

2) ఉద్వేగంలో ఉన్నప్పుడు అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది.?
జ : అడ్రినలిన్

3) విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి.?
జ : స్కర్వి

4) అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏమిటి?
జ : పైరో మీటర్

5) కలరా వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది.?
జ : బ్యాక్టీరియా

6) మలేరియా వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఏది?
జ : ప్రోటోజోవా సూక్ష్మజీవి

7) రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు.?
జ : భారత ప్రధాన న్యాయమూర్తి

8) భారతదేశ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు.?
జ : లార్డ్ రిప్పన్

9) తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు.?
జ : జె.చొక్కారావు

10) విదేశీ పర్యాటకుడు చేత అతి గొప్ప సామ్రాజ్యాధిపతిగా కీర్తించబడిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు.?
జ : అమోఘవర్మ

11) ప్రఖ్యాత కవి గుల్జార్ రచించిన గ్రీన్ పోయమ్స్ ను తెలుగులోకి అనువదించినది ఎవరు?
జ : వారాల ఆనంద్

12) అబుల్ హాసన్ తానిషా కు ఆ పేరు పెట్టిన సూపి మత గురువు పేరేమిటి.?
జ : సారాజు ఖత్తాల్

13) అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథా సంకలనాన్ని ఎవరు వెలువరించారు.?
జ : పసునూరు రవీందర్

14) చలి/చల్లని అనే పదాలను తెలంగాణ మాండలికంలో ఎలా ఉపయోగిస్తారు.?
జ : ఇగం

15) ఆగస్టు 2005లో నియమించబడ్డ రెండవ పరిపాలన సంస్కరణ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు.?
జ : వీరప్ప మొయిలీ

16) భారత రాజ్యాంగం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎవరిని రాజ్యాంగ పనితనాన్ని సమీక్షించడానికి జాతీయ కమిషన్ చైర్మన్ గా నియమించింది.?
జ : జస్టీస్ వెంకటాచలయ్య

17) పౌరసత్వ (సవరణ) చట్టం 2015 – భారతీయ మూలానికి చెందిన కొన్ని వర్గాల వ్యక్తులకు ఒక కొత్త రకం పౌరసత్వాన్ని ప్రవేశపెట్టింది దానిని అధికారికంగా ఏమంటారు.?
జ : ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్

18) స్వరాజ్య పత్రిక స్థాపించినది ఎవరు.?
జ : గాడిచర్ల హరిసర్వోత్తమరావు

19) వివేకవర్ధిని పత్రిక స్థాపించినది ఎవరు?
జ : కందుకూరి వీరేశలింగం

20) మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటుకు ఏ చట్టం ద్వారా బ్రిటీష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.?
జ : 1909 చట్టం