Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 26th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 26th

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 26th

1) నాగనిక వేయించిన శాసనాలలో శాతవాహన రాజు అశ్వమేధ, రాజసూయ యజ్ఞాలు చేసినట్లు తెలుపబడినది. ఆ శాతవాహన రాజు ఎవరు.?
జ : ఒకటవ శాతకర్ణి

2) హనుమకొండలోని వేయి స్తంభాల గుడి లో గల మూల విరాట్టు ఎవరు.?
జ : రుద్రేశ్వరుడు

3) కుతుబ్ షాహీల కాలంలో వజ్రాలు సానబెట్టడానికి ఏ ప్రదేశం ప్రసిద్ధి చెందింది.?
జ : కార్వాన్

4) కాకతీయుల కాలంలో బయ్యారం చెరువు నిర్మించినది ఎవరు?
జ : మైలాంబ

5) 2012లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం సత్యాగ్రహం చేపట్టిన తెలంగాణ నాయకుడు ఎవరు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ

7) అసఫ్ జాహీల కాలంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారు.?
జ : మహాకమ ఇ సదర్

8) సాలార్జంగ్ – 1 ప్రవేశపెట్టిన భూమి కౌలు పద్ధతి ఏది?
జ : సికిందార్

9) 1997 మార్చిలో సాహితీ మిత్రమండలి ఎక్కడ సభ నిర్వహించింది.?
జ : భువనగిరి

10) చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ : ఉత్తర ప్రదేశ్

11) భారతదేశ జాతీయ గీతం ఈ భావాన్ని వ్యక్తీకరించుతుంది.?
జ : భారతదేశం యొక్క సమైక్యత

12) దళితులే మూల భారతీయులు అని, హరప్ప నాగరికతను రూపొందించినది వారేనని గట్టిగా వాదించినది ఎవరు.?
జ : ఎల్లయ్య గౌడ్

13) 1946 – 1951 మధ్యన తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తుపెట్టుకుంటారు.?
జ : చిట్యాల ఐలమ్మ

14) ఈస్ట్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హాజీపూర్

15) మతతిల్ల ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది.?
జ : కోసి

16) భారతదేశంలో ఏ రాష్ట్రము ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది.?
జ : తమిళనాడు

17) లోక్ సభ స్పీకర్ కు కాస్టింగ్ ఓటు కల్పించిన రాజ్యాంగ అధికరణ ఏది.?
జ : 100వ అధికరణ

18) హరిత గృహాలలో వాడే బల్బులను వేటితో తయారుచేస్తారు.?
జ : నియాన్

19) ఆలీగర్ లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ స్థాపించినది ఎవరు?
జ : సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

20) వితంతువుల కోసం పాఠశాల అయిన ‘శారద సదన్’ ను ప్రారంభించినది ఎవరు.?
జ : పండిత రమాబాయి