Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU 13th MAY

DAILY G.K. BITS IN TELUGU 13th MAY

GK BITS

1) ద్రవ్య బిల్లును ఇక్కడ మాత్రమే ప్రవేశపెట్టగలరు.?
జ : రాష్ట్రపతి సిఫార్సుతో లోక్‌సభ లో

2) ఏ రాజ్యాంగ సవరణ బిల్లు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడానికి ఉద్దేశించినది.?
జ : 123వ సవరణ

3) ‘పర్యావరణ వ్యవస్థ’ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు.?
జ : టాన్‌స్లే

4) ‘సునామి’ అనే పదం ఏ భాషకు సంబంధించినది.?
జ : జపనీస్

5) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు.?
జ : గవర్నర్

6) ప్రపంచ భూభాగంలో భారత భూభాగపు వంతు ఎంత.?
జ : 2.4%

7) భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధిపతి ఎవరు.?
జ : ప్రధానమంత్రి

8) ఆధునిక భూకంప శాస్త్ర పితామహుడు ఎవరు..?
జ : జాన్ మిల్నే

9) పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం కాదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ఏది?
జ : బేరుబారి కేసు

10) అమెరికాలోని లిబర్టీ విగ్రహం ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం.?
జ : రాగి ఆక్సీకరణం చెందడం

11) టర్నర్ సిండ్రోమ్ లో ఉండే క్రోమోజోముల సంఖ్య.?
జ : 45

12) వండినప్పుడు ఆహారంలోనే ఏ విటమిన్ త్వరగా నష్టం అవుతుంది.?
జ : విటమిన్ సి

13) హైడ్రో ఫోబియా ఏ వ్యాధి లక్షణం.?
జ : రేబిస్

14) ఏ వ్యాధి నిర్ధారణకు రక్త నమూనాను అర్ధరాత్రి పూట సేకరిస్తారు.?
జ : ఫైలేరియా

15) అంటు రోగాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఏపిడమాలజి