DAILY G.K. BITS IN TELUGU DECEMBER 31
1) మానవుడిలో అతి చిన్న, అతి పెద్ద ఎముకలు ఏవి.?
జ : స్టేపీస్ (చెవి), ఫీమర్ (తొడ)
2) అమెరికా జాతీయా క్రీడ ఏది.?
జ: బాస్కెట్ బాల్
3) భారత్లో అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది.?
జ : K2 గాడ్విన్ (8611 మీటర్లు)
4) భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది.?
జ : NH 44 ( పాత పేరు NH 7) – (శ్రీనగర్ – కన్యాకుమారి (3,745 కీ.మీ.)
5) భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు.?
జ : లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు
6) జాతీయ ఫలము అయినా మామిడి బొటానికల్ నామం ఏమిటి.?
జ : మాంజీపెరా ఇండికా
7) ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు (ఆర్టికల్స్) కలవు.?
జ : 470 (మొదట్లో 395)
8) గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1920
9) బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది ఎవరు?
జ : రాజా రామ్మోహన్ రాయ్ (కలకత్తా)
10) ద్రవ స్థితిలో లభించే ఒకే ఒక లోహం ఏది.?
జ : మెర్క్యురీ (Hg) – పాదరసం
11) భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన “చిలక సరస్సు” ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఒడిశా
12) క్యాన్సర్ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : అంకాలజీ
13) కన్హా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మద్యప్రదేశ్
14) గ్రీన్ హౌస్ వాయువులు అని వేటిని అంటారు.?
జ : CH4, CO2, CFC,
15) భారత అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : విక్రమ్ సారాబాయ్
16) మొదటి ఫిఫా వరల్డ్ కప్ ను గెలుచుకున్న దేశం ఏది.?
జ : ఉరుగ్వే
17) 1498లో వాస్కోడిగామా సముద్ర మార్గం ద్వారా భారత్ లోని ఈ ప్రాంతాన్ని చేరుకున్నాడు.?
జ: కాలికట్
18) పాలిథిన్ తయారీలో వాడే మోనోమర్ ఏమిటి.?
జ : ఇథిలిన్
19) కొవ్వుల్లో కరిగే విటమిన్లు ఏవి.?
జ : A,D,E,K
20) గోబర్ గ్యాస్ లో ఉండే వాయువు ఏది.?
జ : మిథేన్ (CH4)