DAILY CURRENT AFFAIRS IN TELUGU 14th SEPTEMBER 2023
1) ఇటీవల హరిత రైల్వే స్టేషన్ సర్టిఫికెట్ పొందిన రైల్వే స్టేషన్ ఏది.?
జ : విజయవాడ రైల్వే స్టేషన్
2) అమెరికాలో ఏ రాష్ట్రం సెప్టెంబర్ 3న సనాతన ధర్మ దినోత్సవం గా జరుపుకుంటుంది.?
జ : లూయిస్ విల్లే
3) ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సీఈఓ ఎవరు పునర్ నియామకం అయ్యారు.?
జ : సందీప్ భక్షీ
4) డిసెంబర్ 1 2023 నుండి ఏ రాష్ట్రం బహు భార్యత్వాన్ని నిషేధించనుంది.?
జ : అస్సాం
5) ప్రతి శనివారం అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : నాగాలాండ్
6) ఆగస్టు 2023 మాసానికి సంబంధించి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయింది.?
జ : మైనస్ 0.52%
7) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు అవుతుందని ఫిచ్ ఇటీవల వెల్లడించింది.?
జ : 6.3%
8) మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రజనీష్ కుమార్
9) గ్రహాంతర వాసులుగా భావించే ఆకారాలను ఏ దేశ పార్లమెంట్ లో ఇటీవల ప్రదర్శించారు.?
జ : మెక్సికో
10) అన్ని ప్రభుత్వ సేవలకు జనన ధ్రువీకరణ పత్రం ఆధారమని చట్టం (జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం 2023) భారతదేశంలో ఎప్పటినుండి అమల్లోకి రానుంది.?
జ : అక్టోబర్ 1 2023
11) టైమ్స్ 100 మంది ప్రభావశీలుర జాబితా 2023లో ఎంతమంది భారతీయులు చోటు సంపాదించుకున్నారు.?
జ : ముగ్గురు
12) టైమ్స్ 100 మంది ప్రభావశీలుర జాబితా 2023లో చోటు సంపాదించుకున్న భారతీయులు ఎవరు.?
జ : హర్మన్ ప్రీత్ కౌర్, నందితా వెంకటేశన్, విను డానియల్, నాబరన్ దాస్ గుప్తా (ప్రవాస భారతీయుడు)
13) మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్ ను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.?
జ : ఒడిశా
14) వాన చినుకుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ఫ్యానల్స్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : చైనా