Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 4th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 4th OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 4th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 4th OCTOBER 2024

1) అక్టోబర్ 15, 16 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : ఇస్లామాబాద్‌

2) ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా తాజాగా ఎవరు నిలిచారు.?
జ : మెటా సీఈవో జుకర్‌ బర్గ్‌

3) ఎక్స్‌లో మస్క్‌ ఫాలోవర్ల సంఖ్య ఎంతకు చేరింది.? ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి గా రికార్డు.
జ : 200 మిలియన్లకు

4) ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ.. కస్టమర్లకు కేవలం 10 నిమిషాల్లోనే సర్వీస్‌ను అందించేలా ఏ పేరుతో ఓ స్పీడ్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది.?
జ : బోల్ట్‌

5) ఆగస్టులో సేవల రంగం సూచీ 60.9గా ఉంటే.. సెప్టెంబర్‌లో ఎంతగా నమోదు అయింది.?
జ : 57.7

6) BCCI అవినీతి నిరోధ‌క విభాగానికి కొత్త‌ అధిప‌తిగా ఎవరిని నియ‌మించింది.?
జ : శ‌ర‌ద్ కుమార్‌

7) దేశవ్యాప్తంగా డెలివరీ సేవలను విస్తృత పరచడానికి అమెజాన్ భారత్ లో ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : ఇండియన్ పోస్ట్

8) ఏడేళ్ల విరామం తర్వాత ఏ హకి లీగ్ తిరిగి భారత్ లో తిరిగి ప్రారంభం కానుంది.?
జ : హకీ ఇండియా లీగ్

9) మహాత్మ గాంధీ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అమర్ రాజా కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరు.?
జ : గల్లా రామచంద్ర నాయుడు

10) తాలిబన్లను ఉగ్రవాద సంస్థ జాబితా నుంచి తొలగించినట్లు ఏ దేశం తాజాగా ప్రకటించింది.?
జ : రష్యా

11) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో అత్యంత సంపన్న రాష్ట్రంగా భారత్ లో ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : మహారాష్ట్ర

12) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో అత్యంత సంపన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచాయి.?
జ : 8 మరియు 9

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు