CTET 2024 (JULY) NOTIFICATION – నోటిఫికేషన్, సిలబస్, దరఖాస్తు లింక్

హైదరాబాద్ (MARCH – 07) : Central Teacher Eligibility Test JULY 2024 Notification – సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ – (CTET – JULY 2024) జూలై మాసానికి సంబంధించిన నోటిఫికేషన్ ను CBSE విడుదల చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మార్చి 7 నుండి ఎప్రిల్ 02 – 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది కేంద్ర స్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష. దీని వ్యాలిడిటీ జీవిత కాలం ఉంటుంది. సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం :

పేపర్ – 1 ఒకటి నుండి ఐదవ తరగతి బోధన కొరకు, పేపర్ – 2 ఆరు నుంచి 9వ తరగతి వరకు బోధించాలనే వారి కొరకు ఉంటుంది. 20 భాషలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

అర్హతలు :

పేపర్ – 1 : 50% మార్కులతో ఇంటర్మీడియట్ + డీఈడీ చేసి ఉండాలి. లేదా డిగ్రీ + బీఈడీ చేసి ఉండాలి.

పేపర్ – 2 : 50% మార్కులతో డిగ్రీ + డీఈడీ లేదా బీఈడీ చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 1000/- & 1200/- ( పేపర్ 1 & 2 రెండూ) ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు:
రూ.500/- 600/- (పేపర్ 1 &2).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు గడువు మార్చి 07 నుంచి ఎప్రిల్ – 05 – 2024 వరకు

పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష

పరీక్ష తేదీ: జూలై 07 – 2024.
(పేపర్ – 2 : ఉదయం 9.00 – 12.30 వరకు
పేపర్ – 1 : మధ్యాహ్నం 2.00 – 4.30 వరకు)

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APLLY HERE

వెబ్సైట్ : https://ctet.nic.in/