AP JOBS – వైఎస్ఆర్ జిల్లాలో 208 పారామెడికల్ పోస్టులు

కడప : .కడప జిల్లాలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీస్ – కాంట్రాక్టు ప్రాతిపదికన వైఎస్ఆర్ జిల్లా వైద్య సంస్థల్లో 208 పోస్టుల భర్తీకి (CONTRACT JOBS IN YSR KADAPA DISTRICT) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ – 21వ తేదీ లోపల ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

వైద్య సంస్థలు:

  • గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (కడప),
  • ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ (కడప),
  • క్యాన్సర్ కేర్ సెంటర్ (కడప),
  • డా.వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (పులివెందుల),
  • గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (పులివెందుల).

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం : విద్యార్హత మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.

ఖాళీల వివరాలు: క్లినికల్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, లైబ్రేరియన్ అసిస్టెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితరాలు

అర్హతలు : పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (ప్రత్యక్ష) దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ జిల్లా.

దరఖాస్తు గడువు : 21.12.2023.

వెబ్సైట్ : https://kadapa.ap.gov.in/notice_category/recruitment/