Home > TELANGANA > CAST CENSUS – సమగ్ర కుల గణనకు ఉత్తర్వులు జారీ

CAST CENSUS – సమగ్ర కుల గణనకు ఉత్తర్వులు జారీ

BIKKI NEWS (MARCH 16) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుల గణనకు ఉత్తర్వులు విడుదల చేసింది. గత నెలలో మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఆ వెంటనే ఫిబ్రవరి 16న అసెంబ్లీలో తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా తాజాగా జీవో నం.26 జారీ చేసింది. (CAST CENSUS ORDERS RELEASED BY TS GOVT.)

ప్రజల జీవన స్థితిగతులు, వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు కుల గణన చేపడతామని, జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కుల గణనలో ఇంటింటి సర్వే ద్వారా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ఆయా కులాల పరిస్థితిని తెలుసుకోనున్నారు. దీంతోపాటు రాజకీయంగా ఏ కులానికి ఎన్ని పదవులు ఉన్నాయనే దానినీ నమోదు చేస్తారు. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి దాక ఈ వివరాలను సేకరించనున్నారు.

మరోవైపు కుల గణన చేపట్టేందుకు బీసీ సంక్షేమ శాఖ రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసింది. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించడానికి వీలుగా చేపట్టే కుల గణన రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలక నిర్ణయమని ప్రభుత్వం పేర్కొంది. సర్వే విధి విధానాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సర్కారు తెలిపింది.