BIKKI NEWS (MARCH 12) : మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన GO. MS. No. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ (cabinate sub committee on go no. 317) ఈరోజు సమావేశం అయింది. ఈ సమావేశానికి మంత్రులు డీ. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు హజరయ్యారు.
క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ జీవో నెంబర్లు 317, 46 ల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను, అధికారులను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
★ 14న 317 జీవో పై వినతుల స్వీకరణ
317 జీవోపై వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను, ఎదుర్కొంటున్న సమస్యలపై, వినతుల పై ఈనెల 14వ తేదీ సాయంత్రం స్వీకరించాలని నిర్ణయం. ఫిర్యాదులను స్వీకరించడానికి గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటుకు ఆదేశం.
ఈ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోoగ్తు, PRC కమిటీ చైర్మన్ శివ శంకర్, సెక్రటేరియట్ సర్వీసెస్ సెక్రెటరీ నిర్మల, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, శృతి ఓజా డైరక్టర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.