BIKKI NEWS (SEP. 06) : BEd is not qualification for primary school teacher. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి బీఈడీ డిగ్రీ సరైన అర్హత కాదని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ప్రాథమిక విద్యలో డిప్లొమా ఉండటం ఈ ఉద్యోగానికి సరైన అర్హత అని తేల్చి చెప్పింది.
BEd is not qualification for primary school teacher
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా బీఈడీ డిగ్రీ హోల్డర్ల నియామకాలను రద్దు చేస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఈ ఉద్యోగానికి బీఈడీ హోల్డర్స్ అర్హులని చెప్తూ చేర్చిన నిబంధనను అమలు చేయరాదని స్పష్టం చేసింది.
బీఈడీ హోల్డర్స్‌కు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేయడం సరైనదేనని వివరించింది.