Home > ANDHRA PRADESH > mid day meals – ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం

mid day meals – ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం

BIKKI NEWS (DEC. 03) : mid day meals in government junior colleges. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

mid day meals in government junior colleges.

పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం ద్వారా డ్రాపౌట్లను తగ్గించవచ్చని తెలిపారు. దీంతో వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడం కోసం చాగంటి కోటేశ్వరరావు సలహాలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తెలుగు రాష్ట్రాలలో మధ్యాహ్న భోజన పథకం కేవలం పాఠశాల స్థాయి వరకే మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసింది.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో ఈ మధ్యాహ్న భోజన పథకం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు కొరకు ఆటు విద్యార్థులు మరియు విద్యావేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు