ఎస్సీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్లకై దరఖాస్తులు

BIKKI NEWS (JUNE 28) : BACKLOG SEATS ADMISSIONS IN SC GURUKULAS. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల సంక్షేమ సొసైటీలో 5 నుంచి 9 తరగతి వరకు బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి మరోసారి ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది.

విద్యార్థులు రూ.100 చెల్లించి వెబ్‌సైట్‌ ద్వారా జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు.

అలాగే విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ కోసం ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేయాలని సూచించారు. జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఎస్సీ సొసైటీలో ఖాళీ సీట్ల భర్తీలో ప్రాధాన్యక్రమం పాటిస్తామని సొసైటీ వెల్లడించింది. తొలుత సొసైటీలో ప్రవేశాలు పొందినా చేరని వారికి, ప్రవేశపరీక్ష రాసిన వారికి, అనాథలు, సింగిల్‌ పేరెంట్‌ ఉన్నవారికి, దివ్యాంగులు, ప్రవేశపరీక్ష రాయని వారికి వరుస క్రమ ప్రాధాన్యత కింద భర్తీ చేస్తామని తెలిపింది. తల్లిదండ్రులు ఎవరూ సొసైటీ, ప్రాంతీయ సమన్వయకర్తల కార్యాలయాలకు రాకూడదని పేర్కొంది. విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించిన అనంతరం అడ్మిషన్‌కు అర్హులైతే రిజిస్టరు మొబైల్‌నంబరుకు సమాచారం పంపిస్తామని ఎస్సీ సొసైటీ వివరించింది.

వెబ్సైట్ : https://tgswadtr.cgg.gov.in

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు