AUSvsAFG : డబుల్ సెంచరీతో గెలిపించిన మ్యాక్స్‌వెల్

ముంబై (నవంబర్ – 07) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు ముంబై వేదికగా ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్తాన్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ తో (201*) వీరోచిత పోరాటం తో ఓటమి తప్పదు అనుకున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా సంచలన విజయం నమోదు చేసింది. కలలో మాత్రమే ఉహించుకునే విజయం కళ్ళారా చూడడం ప్రేక్షకులకు అదృష్టం. ఈ ప్రపంచ కప్ లో ఇది మొదటి డబుల్ సెంచరీ.

వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ సాదించడం ఇదే ప్రథమం.

అలాగే చేజింగ్ చేసేటప్పుడు ఒక బ్యాట్స్‌మన్ యొక్క అత్యుత్తమ స్కోర్ కూడా మ్యాక్స్‌వెల్ (201*) కావడం విశేషం

ప్రపంచకప్ చరిత్రలో డబుల్ సెంచరీ సాదించిన వారు ముగ్గురు.

  • 237* – Martin Guptill (NZ) vs WI, Wellington, 2015
  • 215 – Chris Gayle (WI) vs ZIM, Canberra, 2015
  • 201* – Glenn Maxwell (AUS) vs AFG, Mumbai WS, 2023

ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ కు అర్హత సాదించిన మూడో జట్టు గా నిలిచింది. ఇప్పటికే ఇండియా, సౌతాప్రికా సెమీస్ కు చేరిన విషయం తెలిసిందే.

292 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఇక ఓటమి లాంఛనమే అనుకున్న దశలో కమ్మిన్స్ (12) తో కలిసి ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు.

8వ వికెట్ కు 202 పరుగుల భాగస్వామ్యం ఉంటే అందులో కమ్మిన్స్ కేవలం 12 పరుగులు మాత్రమే కావడం విశేషం.

ఆప్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 291/5 పరుగులు సాదించింది. ప్రపంచ కప్ చరిత్రలో అఫ్ఘనిస్తాన్ జట్టు తరపున సెంచరీ చేసిన ఇబ్రహీం జార్డన్ (129*) కీలకమైన ఇన్నింగ్స్ ఆడడంతో పాటు, చివర్లో రషీద్ ఖాన్ (35) రాణించాడు అలాగే . ప్రతి బ్యాట్స్‌మన్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఆప్ఘనిస్థాన్ ఫైటింగ్ స్కోర్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజిల్‌వుడు – 2, జంపా, మ్యాక్స్‌వెల్, స్టార్క్ తలో వికెట్ తీశారు.