BIKKI NEWS (NOV. 22) : ARREST WARRENT TO ADANI. భారత కుబేరుడు, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది.
ARREST WARRENT TO ADANI
మోసం, లంచం ఆరోపణలపై ఈ వారెంట్ జారీ చేశారు. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ వివిధ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి
సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్‌పై వచ్చిన దాదాపు రూ.2,240 కోట్ల (265 మిలియన్ డాలర్లు) లంచం ఆరోపణలు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేశాయి.
ఒక్కరోజే గ్రూప్ విలువ రూ.2.20 లక్షల కోట్లు ఆవిరి. లంచం, నేరారోపణలతో 23% వరకు నష్టపోయిన కంపెనీల షేర్లు. ఇది గత ఏడాది హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా గ్రూప్ సంస్థలకు వచ్చిన నష్టాల కంటే రెట్టింపునకుపైగా ఉండటం గమనార్హం.
తమపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, దీనిపై న్యాయపరంగానే ముందుకు వెళ్తామని వెల్లడించింది. దోషులుగా రుజువయ్యేవరకూ నిందితులను నిర్దోషులుగానే చూడాల్సి ఉంటుందని పేర్కొంది. చట్టాలను గౌరవిస్తూ, వాటికి లోబడి నడుచుకొంటున్నట్టు ఉద్ఘాటించింది.