Holidays – ఏప్రిల్ 8 – 17 వరకు వరుస సెలవులు

BIKKI NEWS (MARCH 27) : ఏప్రిల్ నెలలో పాఠశాలలు, కాలేజీలకు వరుస సెలువులు రానున్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవులు ఉండ‌బోతున్నాయి. వీటితో పాటు.. రెండో శనివారం, ఆదివారం కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు (APRIL 8th to 17th Holidays) వరుసగా స్కూళ్ల‌కు సెలవులు రానున్నాయి. అలాగే కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు.

వేసవి సెలవులు కూడా.. ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 20 నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం. దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి సెలవులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ సారి వేసవి సెలవులు ఎక్కవగా ఇచ్చే అవకాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో వార్షిక ప‌రీక్ష‌ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక జూన్ 13న కొత్త విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది.