AP DSC 2024 NEW EXAM DATES – ఏపీ డీఎస్సీ పరీక్షల నూతన తేదీలు

BIKKI NEWS (MARCH 12) : AP DSC 2024 NEW EXAM DATES – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన డీఎస్సీ 2024 నోటిఫికేషన్ యొక్క నూతన పరీక్షల షెడ్యూల్ ను ఈరోజు విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు. మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు 14 రోజులపాటు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా పూర్తి షెడ్యూల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షలకు మధ్య సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరియు ఎస్జిటి పోస్టులకు అర్హతను సమీక్షించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ ను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

మార్చి 20వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా పరీక్ష కేంద్రాలను ఎంచుకునే సౌలభ్యం ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. అలాగే మార్చి 25వ తేదీ నుండి వెబ్సైట్ లో డిఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

AP DSC 2024 NEW EXAM DATES