AIRTEL SCHOLARSHIP – 100 కోట్లతో ఎయిర్ టెల్ స్కాలర్ షిప్

BIKKI NEWS (JULY 17) : Airtel Scholarship with 100 crores. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ‘భారతీ ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం’ కింద స్కాలర్ షిప్ లు అందించేందుకు భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ ఇక నుండి ప్రతి సంవత్సరం రూ.100 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది ఈ స్కాలర్ షిప్ కింద 4,000 మంది విద్యార్థులకు సహాయం అందించనున్నారు.

Airtel Scholarship with 100 crores

ఎవరు అర్హులు

ప్రముఖ విద్యా సంస్థల్లో సాంకేతిక విద్య అభ్యసిస్తున్న వారికి ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ లో చేరిన విద్యార్థినులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.

తొలి దశలో భాగంగా ఆగస్టులో 250 మంది విద్యార్థులను ఇందుకోసం ఎంపిక చేస్తున్నట్లు పేర్కొంది. దీన్ని 4,000 మంది విద్యార్థులకు దశల వారీగా పెంచి, ఏడాదికి రూ.100 కోట్లు అందిస్తామని ఎయిర్టెల్ తెలిపింది.

దేశంలోని అగ్రగామి 50 ఎన్ఐఆర్ఎఫ్ కాలేజీలు, ఐఐటీల్లో చదివే వారిని ఎంచుకుంటామని వివరించింది. ఫౌండేషన్ ద్వారా గత 25 ఏళ్ల కాలంలో 60 లక్షల మందికి మేలు చేకూర్చినట్లు భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ కో-చైర్మన్ రాకేశ్ భారతీ మిత్తల్ తెలిపారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు