Home > EDUCATION > PJTSAU > Agri Diploma Course – అగ్రికల్చర్ డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్స్

Agri Diploma Course – అగ్రికల్చర్ డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్స్

BIKKI NEWS (JULY 05) : AGRICULTURE DIPLOMA COURSES ADMISSIONS 2024. ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ను ప్రకటించింది.

వ్యవసాయ వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో రెండేళ్ల డిప్లోమా ఇన్ అగ్రికల్చర్, డిప్లోమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు. జూలై 10, 11, 12వ తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ రఘురామిరెడ్డి తెలిపారు.

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు.

అర్హతలు : పాలిసెట్ 2024 అగ్రికల్చరల్ స్ట్రీమ్ లో అర్హత సాధించి ఉండాలి.

పదో తరగతి ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

ఎంపిక విధానం : POLYCET 2024 అగ్రికల్చర్ స్ట్రీమ్ లో ర్యాంక్ ఆధారంగా.

పదోతరగతి పాయింట్ల ఆధారంగా

వయోపరిమితి : 31 – 12 – 2024 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 1200/- (SC, ST, PH – 600/- రూపాయలు)

కౌన్సెలింగ్ తేదీలు : జూలై 10, 11, 12

వెబ్సైట్ : https://diploma.pjtsau.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు