AUS vs AFG – ఆస్ట్రేలియా కు అఫ్ఘనిస్తాన్ షాక్

BIKKI NEWS (JUNE 23) : Afghanistan beats Australia in icc t20 world cup. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు వృధా అయ్యాయి.

Afghanistan beats Australia in icc t20 world cup

మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులను సాధించింది. ఓపెనర్లు గుర్బాజ్ – 60 పరుగులు, జాడ్రాన్ – 51 పరుగులతో రాణించారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమ్మిన్స్ – 3 జంపా – 2, స్టోయినిస్ ఒక వికెట్ తీశారు. ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం. ఈ వరల్డ్ కప్ లో కమ్మిన్స్ కు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కూడా హ్యాట్రిక్ నమోదు చేశాడు.

అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. కేవలం మాక్స్ వెల్ మాత్రమే వన్డే వరల్డ్ కప్ లోని ఇన్నింగ్స్ ను గుర్తు చేస్తూ పోరాటం చేసిన చివరి వరకు నిలబడకపోవడంతో ఆస్ట్రేలియా పరాజయం తప్పలేదు.

మ్యాక్స్ వెల్ – 59, స్టోయినిస్ – 11 మినహా మిగతా బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్ కే అవుట్ కావడం విశేషం. చివరకు 19.2 ఓవర్లలో 127 పరుగులను మాత్రమే ఆస్ట్రేలియా చేయగలిగింది.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బర్దిన్ నాయబ్ – 4, నవీన్ ఉల్ హక్ – 3 వికెట్లు మరియు రషీద్, నబీ, ఒమర్జాయ్ తలో వికెట్ తీశారు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గులాబ్దిన్ నాయబ్ నిలిచాడు.

సెమీస్ అవకాశాలు ఇలా

తదుపరి మ్యాచ్ లలో ఆస్ట్రేలియా – ఇండియా తో తలపడాల్సి ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంది.

ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయి, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పై గెలిస్తే సెమీఫైనల్ కు చేరే అవకాశం ఆఫ్గానిస్థాన్ కు ఉంటుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు