Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS – ఇంగ్లీషు సెకండీయర్ లో అస్పష్ట ప్రశ్నకు మార్కులు

INTER EXAMS – ఇంగ్లీషు సెకండీయర్ లో అస్పష్ట ప్రశ్నకు మార్కులు

BIKKI NEWS (MARCH 10) : adding of marks in inter 2nd year english exam. ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష లో 7వ ప్రశ్న ప్రశ్నా పత్రంలో అస్పష్టంగా ఉన్న కారణంగా మార్కులు కేటాయిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.

adding of marks in inter 2nd year english exam

ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఇంగ్లీష్ రెండవ సంవత్సరం ప్రశ్నాపత్రంలో 7వ ప్రశ్నలో ‘పై చార్ట్’ కు సంబంధించిన ప్రశ్నలో కొంత మంది విద్యార్ధుల ప్రశ్నాపత్రంలో ముద్రణలో గీతల అస్పష్ఠతను గుర్తించినట్లు బోర్డు వారి దృష్ఠికి తీసుకురావడం జరిగింది.

దీనిపై సబ్జక్ట్ నిపుణులు విపులంగా చర్చించారు. విద్యార్ధులకు న్యాయం చేయాలనే సంకల్పంతో జవాబును సమాధాన పత్రంలో రాయడానికి ప్రయత్నించిన వారందరికీ ప్రశ్నకు కేటాయించిన మార్కులు ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు