Home > JOBS > AP JOBS > KGBV JOBS – 604 కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

KGBV JOBS – 604 కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్, దరఖాస్తు లింక్

BIKKI NEWS (SEP. 25) : AP KGBV CONRACT JOBS NOTIFICATION 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2024 – 25 విద్యా సంవత్సరంలో కాంట్రాక్టు పద్దతిలో టీచింగ్, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ అయింది

AP KGBV CONRACT JOBS NOTIFICATION 2024

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోదనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) మరియు బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల (ఔట్సోర్సింగ్) ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్ధులనుండి దరఖాస్తులను కోరడమైనది.

ఖాళీల వివరాలు: మొత్తం 604

ప్రిన్సిపాల్-10
పీజీటీ-165
సీఆర్టీ-163
పీఈటీ–4
పార్ట్ టైం టీచర్స్ -165
వార్డెన్-53
అకౌంటెంట్-44

ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : రూ. 250/-

దరఖాస్తు గడువు : 26-09-2024 నుంచి 10-10-2024 రాత్రి 11.59 నిమిషముల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆఫ్లైన్/ఫిజికల్ దరఖాస్తులు స్వీకరించబడవు.

వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్ధులకు 18-42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, EWS 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు.

జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, గౌరవ వేతనము మరియు విద్యార్హత వివరాలను వెబ్సైట్ నందు ఉంచబడిన పూర్తి నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును.

వెబ్సైట్ : https://apkgbv.apcfss.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు