Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 09 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 09 – 2024

BIKKI NEWS (SEP. 02) : TODAY NEWS IN TELUGU on 2nd SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 2nd SEPTEMBER 2024

TELANGANA NEWS

రాష్ట్రంలో భారీ వర్షాలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు.

రాష్ట్రంలో భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మృతి. పదుల సంఖ్యలో గల్లంతైనట్లు సమాచారం

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

మానుకోట అతలాకుతలం.. భారీవర్షాలతో రోడ్డు, రైలు మార్గాలన్నీ బంద్‌

ఖమ్మంలో జలప్రళయం.. ఊళ్లకు ఊళ్లను ముంచెత్తిన వరద. ఖమ్మంలో మున్నేరు ఉధృతి.. జలదిగ్బంధంలో కాలనీలు.. సాయం కోసం బాధితుల ఆర్తనాదాలు.

భారీ వర్షాలతో 15 లక్షల ఎకరాల్లో పంట మునిగినట్లు సమాచారం

నాయకన్ గూడెం లో ఇంటితో సహా కొట్టుకుపోయిన యాకూబ్ కుటుంబం. కుమారుడు షరీఫ్ ను కాపాడిన పోలీసులు. దంపతులు ఆచూకీ కోసం గాలింపు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు నూనావత్‌ మోతీలాల్‌ (45), నూనావత్‌ అశ్వని (26) వాగు వరదనీటిలో గల్లంతయ్యారు.

ANDHRA PRADESH NEWS

రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అతలాకుతలమైంది. 14 నియోజకవర్గాల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 9 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రతీ భక్తుడికి తగినన్ని లడ్డూలు ఇస్తాం – టీటీడీ ఈవో శ్యామలరావు.

భారీ వర్షాల కారణంగా తెలంగాణ-ఏపీ మధ్య నిలిచిన రాకపోకలు.. అంతర్రాష్ట చెక్‌పోస్ట్‌ వద్ద నిలిచిన వాహనాలు

కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.

వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నూనె, ఉల్లిగడ్డలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు.. హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు బంద్..

గుడ్లవల్లేరు హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా ఉంటే చూపించండి.. మీడియాపై నారా లోకేశ్‌ ఫైర్‌

గుడ్లవల్లేరు కాలేజీ విద్యార్థినులపై మహిళా ఎస్సై సీరియస్‌.. సస్సెండ్‌ చేసిన ఏపీ సర్కార్‌

NATIONAL NEWS

బెంగాల్‌లో మరో దుర్ఘట.. రాత్రి విధుల్లో ఉన్న నర్సుపై వేధింపులు.

ఢిల్లీలో ట్రాఫిక్‌ నిర్వహణను మెరుగుపర్చడంతోపాటు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు సరికొత్త పథకం ప్రకటించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసినవారికి రూ.50 వేలు నజరానాగా ఇవ్వనున్నట్టు తెలిపారు.

మణిపూర్‌లో మళ్లీ హింస రేగింది. పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలో అనుమానిత కుకీ తీవ్రవాదులు ఆదివారం జరిపిన డ్రోన్‌, తుపాకీ, బాంబు దాడుల్లో ఓ మహిళ సహా ఇద్దరు మరణించారు.

జార్ఖండ్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నియామకాల తీరు వివాదాస్పదంగా మారింది. శారీరక దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర కలకలం రేపింది.

ఒడిశాలోని శ్రీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండార్‌లో తలుపులకు రెండు వైపులా బంగారు తాపడం చేయించబోతున్నారు

వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌ ధరపై కేంద్రం రూ.39 పెంచింది. దీంతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,919కి చేరుకుంది

గ్లియోబ్లాస్టోమా అనే ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌ను మొదట్లోనే కనిపెట్టగల కొత్త రక్త పరీక్షను పరిశోధకులు అభివృద్ధి చేశారు.

పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించేందుకు పక్కా ప్రణాళిక : సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు.

వందే భారత్‌ స్లీపర్‌ని ఆవిష్కరించిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌..

పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్ 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు దరఖాస్తులు ఆహ్వానం.

INTERNATIONAL NEWS

ఆసియన్‌ నోబెల్‌ ప్రైజ్‌గా భావించే రామన్‌ మెగసెసె అవార్డు 2024 సంవత్సరానికిగానూ ప్రముఖ జపాన్‌ యానిమేటర్‌ హయావో మియాజాకీని వరించింది. వియత్నాం డాక్టర్‌ న్గుయెన్‌, మాజీ బౌద్ధ సన్యాసి కర్మ ఫుంట్‌షొ, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్‌కు అవార్డు లభించింది. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన రూరల్‌ డాక్టర్స్‌ మూమెంట్‌ సంస్థకు కూడా పురస్కారం దక్కింది.

బంగ్లాదేశ్‌లో హిందూ టీచర్లతో బలవంతంగా రాజీనామాలు

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియాకు పుతిన్‌ బహుమతులు పంపుతున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు అత్యంత ఇష్టమైన 24 గుర్రాలను పుతిన్‌ అందజేశారని ‘ద టైమ్స్‌’ కథనం తాజాగా పేర్కొన్నది.

హమాస్‌ నిర్బంధంలో ఉన్న ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ ఆదివారం ప్రకటించింది.

యూఏఈలో అక్రమంగా నివసిస్తున్న వారి కోసం అక్కడి ప్రభుత్వం రెండు నెలల వీసా ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని ఈ నెల 1న ప్రారంభించింది.

హ్వాల్దిమిర్‌’ పేరుతో 2019లో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెలుగా రకపు తిమింగలం నార్వేలోని ఓస్లోఫ్జోర్డ్‌లో గత నెల 31న మరణించింది.

BUSINESS NEWS

మార్కెట్లు నూతన గరిష్ఠాల వద్ద ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేసే వీలుందని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వారం కరెక్షన్‌కు అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఆగస్టు నెలలో రూ.1.75 లక్షల కోట్లుగా ఉందని కేంద్రం ఆదివారం ప్రకటించింది.

బజాజ్ కంపెనీ ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి CNGతో నడిచే బైక్‌ను విడుదల చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకేసి ఇథనాల్‌తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది

SPORTS NEWS

పారా ఒలింపిక్స్ 2024లో మహిళల 200 మీటర్ల రేసులోనూ కాంస్యం గెలుచుకుంది. మొన్న 100 మీటర్ల రేసులోనూ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు గెలుచుకున్న క్రీడకారిణిగా రికార్డు.

బ్యాడ్మింటన్‌లో మూడు పతకాలు పక్కా… కుమార్‌ నితేశ్‌, సుహాస్‌ యతిరాజ్‌ ఫైనల్ కు చేరారు.

యూఎస్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు సిన్నర్‌, మెద్వెదెవ్‌, జ్వెరెవ్‌, స్వియాటెక్‌, సబలెంకా, జాస్మిన్, కోకో గాఫ్‌

ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో ఆరుగురు భారత క్రికెటర్లు ఆడనున్నారు. ఆదివారం వేలం ప్రక్రియ ముగియడంతో…
స్మృతి మంధాన అడిలైట్‌ స్ట్రైకర్స్‌కు, దయాలన్‌ హేమలత పెర్త్‌కు, యస్తికా భాటియా, దీప్తి శర్మ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కు, శిఖా పాండే, స్టార్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ బ్రిస్బేన్‌ హీట్‌కు ఆడనున్నారు.

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది.

పాకిస్థాన్‌తో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ పట్టుబిగిస్తోంది.

టీ20ల్లో ఒకే ఏడాది అత్య‌ధిక సిక్స‌ర్ల వీరుడిగా నికోలస్ పూరన్ అవ‌త‌రించాడు. ప్ర‌స్తుతం పూర‌న్ 139 సిక్స‌ర్లతో టాప్‌లో ఉండ‌గా.. గేల్ 2015లో 135 సిక్సర్ల‌తో చ‌రిత్ర సృష్టించాడు.

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో పొట్టి ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు ప‌లికాడు. ఇప్ప‌టికే వ‌న్డేల‌కు, టెస్టుల‌తో పాటు ఐపీఎల్ నుంచి వైదొలిగిన బ్రావో ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు

EDUCATION & JOBS UPDATES

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదావేశారు.

ENTERTAINMENT UPDATES

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 8 ప్రారంభం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు