BIKKI NEWS (JULY 16) : BASARA IIIT 2nd Phase counselling 2024. బాసర ట్రిపుల్ ఐటీ లో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియలో మిగిలిన 101 సీట్లతో పాటు గ్లోబల్ కేటగిరీ లో ఉన్న 105 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
రెండో విడత కౌన్సెలింగ్ కు అర్హులైన విద్యార్థుల జాబితాను సోమవారం సాయంత్రం ప్రత్యేకాధికారి సృజన, సంయుక్త కన్వీనర్ పావని వర్సిటీలో విడుదల చేశారు.
విద్యార్థులకు జూలై 19న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా, గ్లోబల్ 105 సీట్లకు కేవలం 17 దరఖాస్తులే వచ్చాయి. వారిని కూడా కౌన్సెలింగ్ కు పిలిచారు.
ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల మొదటి జాబితాను ఈ నెల 3న విడుదల చేశారు. అందులో కౌన్సెలింగ్కు 104 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారికంగా ప్రకటించారు. కానీ తాజా జాబితాలో 101 ఖాళీలే చూపారు.