UGC NET 2024 CANCELLED – యూజీసీ నెట్ రద్దు

BIKKI NEWS (JUNE 19) : UGC NET 2024 CANCELLED BY NTA. యుజిసి నెట్ 2024 పరీక్షను రద్దు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18న దేశ వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం వెలువడింది.

UGC NET 2024 CANCELLED

యుజిసి నెట్ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుండి నివేదిక రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశ వ్యాప్తంగా ఆందోళనలో జరుగుతున్న నేపథ్యంలో యు జి సి నెట్ పరీక్ష కూడా రద్దు కావడం విశేషం.

యుజిసి నెట్ 2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

జూన్ 18వ తేదీన ఓఎంఆర్ పద్ధతిలో రెండు సెషన్లలో జరిగిన ఈ పరీక్షను రద్దు చేయడానికి కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. రద్దు చేయడానికి గల అవకతవకలకు సంబంధించిన సమాచారం యూజేసీకి అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అవకతవకలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టి ప్రసక్తే లేదని విద్యాశాఖ ప్రకటించింది. త్వరలోనే వీరిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

యూజీసీ నెట్ 2024 పరీక్షలను తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే నీట్ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై తల పట్టుకున్న కేంద్రం, ఈ విషయంతో మరింత డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి వచ్చింది.

నీట్ యూజీ 2024 సంబంధించి గ్రేస్ మార్కులు కలపడం, బీహార్ వంటి రాష్ట్రాల్లో అవకతవకలు జరగడంతో పరిస్థితి గందరగోళం గా ఉంది. ఇప్పటికే బీహార్ పోలీసులు ఈ విషయంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈ అంశంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది

JOB NOTIFICATIONS

Telegram Channel link