Home > EMPLOYEES NEWS > DA – 23.66 శాతానికి డీఏ

DA – 23.66 శాతానికి డీఏ

హైదరాబాద్ (డిసెంబర్ – 03) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు ఒక్క డీఏ ను అక్టోబర్ నుంచి చెల్లింపుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో ఉద్యోగుల డీఏ 3.64 శాతం (employees DA increased) పెరుగుతుంది.

మూలవేతనంపై ప్రస్తుతం 20.02% డీఏ చెల్లిస్తుండగా, తాజా పెంపుతో డీఏ 23.66 శాతానికి చేరుతుంది. 6 నెలలకు ఒక డీఏను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విడుదల చేసే డీఏ 1-7-2022కు చెందినది.

ఈసీ అనుమతితో డీఏను ప్రభుత్వం విడుదల చేస్తే జీపీఎఫ్ ఉన్న వారికి జీపీఎఫ్ లో కలుస్తుంది. సీపీఎస్ ఉద్యోగులకు 10శాతం ప్రాన్ అకౌంటు, 90 శాతం ఎరియర్స్ ను 8 సమాన వాటాల్లో అందజేస్తారు. డీఏ విడుదల ద్వారా రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు లబ్ది పొందుతారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.