BIKKI NEWS : ICC HALL OF FAME లో భారత మాజీ ఆటగాళ్లు వీరేందర్ సెహ్వాగ్, డయానా ఎడుల్జీలకు చోటు దక్కింది. అలాగే శ్రీలంక క్రికెటర్ అరవింద డిసిల్వా కు చోటు దక్కింది. (Sehwag, Edulji, Aravinda De silva placed in ICC HALL OF FAME list)
ఈ గౌరవం దక్కిన తొలి భారత మహిళా క్రికెటర్ గా డయానా ఎడుల్జీ నిలిచింది.
ఈ గౌరవం పట్ల ఎడుల్జీ స్పందిస్తూ ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి కావడం తనకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపింది.
DIANA EDULJI
67 ఏళ్ల ఎడుల్జీ ప్లేయర్, అనంతరం పాలనా దక్షత కలిగిన కెప్టెన్ గా రాణించింది. మూడు దశాబ్దాల కెరీర్ లో ఎడుల్జీ 54 మ్యాచ్ లలో (20 టెస్టులలో 404 పరుగులు, 63 వికెట్లు; 34 వన్డేలలో 211 పరుగులు, 46 వికెట్లు) తనదైన ముద్ర వేసింది.
VIRENDRA SEHWAG
ధాటైన బ్యాట్స్‌మన్ గా పేరుగాంచిన సెహ్వాగ్ 1999- 2013 మధ్య కాలంలో 104 టెస్టులలో 8,586 పరుగులు 40 వికెట్లు, 251 వన్డేలలో 8,273 పరుగులు 96 వికెట్లు, 19 టీ20 మ్యాచ్ లలో 394 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టులో 309 అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాదించాడు.
2007 టీట్వంటీ వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లు నెగ్గిన టీమిండియా సభ్యుడు.
ARVINDA DE SILVA
శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మన్ అరవింద డిసిల్వా 93 టెస్టులలో 6,361 పరుగులు సాదించి, 29 వికెట్లు తీశాడు. 308 వన్డే లలో 9,284 పరుగులు, 106 వికెట్లు తీశాడు. 1996 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ విజేత గా నిలిచింన లంక జట్టులో ఆటగాడు.