హైదరాబాద్ (ఆగస్టు – 28) : World Athletics Championship 2023 లో Javelin Throw లో భారత ఆటగాడు నీరజ్ చోప్రా ( NEERAJ CHOPRA won gold medal ) 88.17 మీటర్లు విసిరి పసిడి పథకాన్ని ముద్దాడాడు. పాకిస్థాన్ అర్షద్ నదీమ్ రజతం, జాకబ్ కాంస్యం నెగ్గారు. Neeraj Chopra won Gold medal In World athletics Championship 2023
గతేడాది ఇదే క్రీడలలో రజతంతో సరిపెట్టుకున్న నీరజ చోప్రా ఈసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించిన దగ్గర నుండి నీరజ్ చోప్రా వెనతిరిగి చూడలేదు. డైమండ్ లీగ్ లో కూడా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
పాకిస్తాన్ జావలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ (87.82 మీటర్లు) నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ లో హెచ్ ఎస్ ప్రణయ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.