హైదరాబాద్ (జూలై – 10) : కెనడా బ్యాడ్మింటన్ ఓపెన్ టైటిల్ -2023 పురుషుల సింగిల్స్ విజేతగా భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ నిలిచారు. (Canada badminton open 2023 winner LakshyaSen)
ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన లిషి ఫెంగ్ఫీ పై 21-18, 22-20 తేడాతో వరుస గేమ్ లలో లక్ష్యసేన్ విజయం సాధించారు.
ఈ టోర్నీ ఆరంభం నుంచి సూపర్ ఫామ్ లో ఉన్న లక్ష్యసేన్ టైటిల్ పోరులో కూడా చెలరేగి ఆడి సూపర్ 250 టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.
ఇక మరో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్ ఓటమితో వెనుదిరిగిన సంగతి తెలిసిందే.