Home > NATIONAL > AADHAR UPDATE PROCESS : మొబైల్ లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే విధానం

AADHAR UPDATE PROCESS : మొబైల్ లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే విధానం

హైదరాబాద్ (జూన్ – 18) : ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ (Aadhar Update process in mobiles) తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం అందుకోసం సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది.

మీ సేవా లేదా ఆధార్ కేంద్రానికి వెళ్ళకుండానే మన మొబైల్ లో MY AADHAR app లేదా UIDAI అధికారిక వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డలోని వివరాలను అప్డేట్ ఎలా చేసంకోవాలో చూద్దాం..

1) UIDAI అధికారిక వెబ్సైట్‌ అయినా https://myaadhaar.uidai.gov.in లో ఆధార్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి.

2) ప్రొసీడ్‌ టూ అప్‌డేట్‌ అడ్రస్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసిన అనంతరం వచ్చే డాక్యుమెంట్‌ అప్‌డేట్‌పై క్లిక్‌ చేయాలి.

3) అప్పటికే అందులో పొందుపర్చిన వివరాలన్నీ తెరపైకి వస్తాయి. వీటిలో సవరణ ఉంటే చేసుకోవాలని, లేకుంటే ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్‌పై క్లిక్‌ చేయాలి.

4) ఆ తర్వాత కనిపించే డ్రాప్‌ డౌన్‌ జాబితా నుంచి ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటి, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ డాక్యుమెంట్లు ఎంచుకుని, వాటి స్కాన్‌ కాపీలు అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. పద్నాలుగు అంకెల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ స్క్రీన్‌పై వస్తుంది.

5) దానితో అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకునే వీలు కలుగుతుంది.