పారిస్ (జూన్ – 11) : French open 2023 Men’s Singles winner Novac Djocovic… ఫ్రెంచ్ ఓపెన్ 2023 విజేతగా నోవాక్ జకోవిచ్ నిలిచాడు… ఇది జకోవిచ్ కెరీర్ లో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫైనల్ లో కాస్పర్ రూడ్ ను వరుస సెట్లలలో 7 -1 (7-6), 6 – 3, 7- 5 తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
జకోవిచ్ కు ఇది రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నాదల్ రికార్డు (22) ను బ్రేక్ చేశాడు.
ఇది జకోవిచ్ కు మూడో ఫ్రెంచ్ ఓపెన్. 2016, 2021 లో కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గాడు.