BIKKI NEWS (MAY 31) : 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988 ఏప్రిల్ 7న ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దానిని అనుసరించి 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.
పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ ఫల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే.
పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంకోసం అవగహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ప్రతి ఏటా పొగాకు వాడకం వలన దేశంలో 12 లక్షల మంది మరణిస్తున్నారని తాజా నివేదిక తెలిపింది. (Wikipedia)